కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన సుమంగళ, శంకరమూర్తి (50) భార్యాభర్తలు. సుమంగళ తిప్పూర్‌లోని కల్పతరులో ఉన్న బాలికల హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నది. శంకరమూర్తి ఓ ఫామ్‌హౌస్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు. కాగా, తాను పనిచేస్తున్న చోట కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో సుమంగళకు పరిచయమైంది. అదికాస్తా అక్రమసంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో శంకరమూర్తి తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన సుమంగళ, నాగరాజు అతడిని చంపాలని నిశ్చయించుకున్నారు. దీంతో ఈ నెల 24న తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలుకాలోని కడశెట్టిహళ్లీ గ్రామంలో ఉన్న శంకరమూర్తి వద్దకు సుమంగళ వెళ్లి భర్త కళ్లలో కారం పొడి చల్లి కర్రతో కొట్టింది. అనంతరం అతని మెడపై కాలుతో తొక్కి చంపింది. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత ప్రియుడితో కలిసి అతని మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కి గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోని దండనిశివర పోలీస్ స్టేసన్ పరిధిలోని ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు. కాగా, శంకరమూర్తి కనిపించకుండా పోవడంతో నోనవినకెరే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది. దర్యాప్తులో భాగంగా మృతుడి మంచంపై కారం పొడి ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు.. సుమంగళను తమదైన శైలిలో విచారించడంతోపాటు, ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేయడంతో హత్య కుట్ర బయటపడింది.
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్యా
June 29, 2025
0
Tags