గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన దుర్ఘటనలో మొత్తం 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. ప్రధానితో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. అనంతరం ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాల సంబంధిత కుటుంబాలకు త్వరగా అప్పగించేలా పక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు. అదేవిధంగా ఫ్లైట్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇక క్షతగాత్రులైన మెడికోలు ఆసుపత్రిలో చికిత్స పొందతుండగా, ప్రధాని అక్కడికి నేరుగా వెళ్లి ప్రమాదంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రధాని మోడీ
June 13, 2025
0
Tags