గుజరాత్‌ రథయాత్రలో ఏనుగు బీభత్సం : 9 మందికి గాయాలు

Telugu Lo Computer
0


డిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్‌లోని గోల్‌వాడలో రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది. ఏకంగా భక్తులపైకి దూసుకెళ్లడంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)