8 రోజులు పాటు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

Telugu Lo Computer
0

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ 8 రోజులు పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. మొదటగా జూలై 2, 3వ తేదీల్లో ఆఫ్రికా దేశం ఘనా వెళ్తారు. ఆ దేశంలో ప్రధాని మొట్టమొదటి సారిగా పర్యటించనున్నారు. భారత్‌ ప్రధాని అక్కడ పర్యటించడం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఘనా నుంచి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు వెళ్తారు. అక్కడ జూలై 3, 4వ తేదీల్లో పర్యటించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఒకరు అక్కడికెళ్లడం ఇదే మొదటిసారి. అనంతరం, జూలై 4, 5వ తేదీల్లో అర్జెంటినా వెళ్తారు. జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్‌ సమిట్‌లో పాల్గొంటారు. చివరగా ప్రధాని నమీబియా చేరుకుంటారు. నరేంద్ర మోడీ నమీబియాలో పర్యటించే మూడో భారత ప్రధానిగా నిలువనున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)