5న జరిగే వన మహోత్సవంలో కోటి మొక్కలు నాటాలి : సీఎం చంద్రబాబు పిలుపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ఈనెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఈకార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఈ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండులు, రహదారులకు ఇరువైపులా 'కోటి మొక్కల' కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్‌ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా, ఈనెల ఐదో తేదీన అమరావతిలోని అనంతవరంలో జరిగే వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడీసీఎల్‌ సీఎండీ లక్ష్మీ పార్థసారథి అనంతవరంలోని నర్సరీ, ఉద్యానవనాలను సోమవారం పరిశీలించారు. మొత్తం రెండు వేల మొక్కలు ఈ కార్యక్రమంలో భాగంగా నాటనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)