ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరులో 16 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ భవనాన్ని చూసి షాకయ్యారు. అనుమతులు లేకుండా కడుతున్నారని తెలుసుకుని పంచాయతీ కార్యదర్శిని వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు. పాలకోడేరు మంగయ్య చెరువు సమీపంలో చిన్న స్థలంలో ఈ భవనం కడుతుండటం చర్చనీయాంశమైంది. రోడ్డు పక్కన స్థలం ఉండటంతో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామ కంటపడింది. స్థానికులు అనుమతులు తీసుకోలేదని చెప్పడంతో డిప్యూటీ స్పీకర్ సీరియస్ అయ్యారు. పంచాయతీ కార్యదర్శిని పిలిచి ఆ భవనాన్ని అనుమతి లేకుండా నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో ఈ భవనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంత తక్కువ స్థలంలో మూడు అంతస్తలు నిర్మించడం అంత సేఫ్ కాదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 16 గజాల్లో మూడంతస్తుల భవనం నిర్మాణం
June 12, 2025
0
Tags