విమాన ప్రయాణికుడి పొట్టలో ₹11కోట్ల విలువైన కొకైన్‌ క్యాప్సుల్స్‌ పట్టివేత

Telugu Lo Computer
0


ముంబయి విమానాశ్రయంలో కొకైన్‌ క్యాప్సుల్‌ను మింగి ప్రయాణిస్తున్న వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతడి పొట్టలో నుంచి 1,139 గ్రాముల మాదకద్రవ్యాలున్న 67 క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.39 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. నిందితుడిని ఐవరీకోస్ట్‌ జాతీయుడిగా గుర్తించారు. సియెర్రా లియోన్‌ నుంచి ముంబయి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అనంతరం విచారించగా మాదకద్రవ్యాలతో కూడిన క్యాప్స్యూల్స్‌ను తీసుకున్నట్లు అంగీకరించాడు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించారు. చివరకు అతడి నుంచి క్యాప్యుల్స్‌ను బయటకు తీశారు. దాదాపు రూ.11కోట్లు విలువైన వాటిని స్వాధీనం చేసుకున్న నార్కొటిక్స్‌ అధికారులు.. నిందితుడిని అరెస్టు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)