మేడం టుస్సాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని రామ్ చరణ్ తేజ ఆవిష్కరించబోతున్నారు. లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్ట మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే కాబోతున్నారు. నిజానికి గతంలోనే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు, కానీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియంలలో ఉన్నాయి. కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన భార్య ఉపాసన, తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖతో కలిసి లండన్ బయలుదేరారు. ఈ మైనపు విగ్రహంతో పాటు రామ్ చరణ్ తేజ పెంపుడు జంతువు రైమ్, టాయ్ పూడిల్ జాతికి చెందిన పప్పీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో రైమ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ టీమ్ ఎప్పటికప్పుడు రైమ్ ఫోటోలు, వీడియోలను సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటారు.
లండన్ వ్యాక్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం
May 06, 2025
0
Tags