రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలను సందర్శించనున్నారు. గతంలో రాష్ట్రపతులుగా పనిచేసిన వారెవరూ శబరిమలను సందర్శించకపోవడం విశేషం. దీంతో శబరిమలను సందర్శించే రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు కేరళ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు సోమవారం పర్యటన వివరాలను వెల్లడించాయి. ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము కేరళలో పర్యటించనున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి కొట్టాయం చేరుకుంటారు. అక్కడ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 19వ తేదీన పంపా బేస్ క్యాంపుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకొంటారు.
శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
May 06, 2025
0
Tags