హెచ్ఐవి పాజిటివ్ కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్

Telugu Lo Computer
0

దేశవ్యాప్తంగా 24.65 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ రోగులు ఉన్నట్లు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సంకల్ప్ బుక్లెట్ 2023 నివేదిక తెలిపింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర 3.85 లక్షల మంది హెచ్ఐవి రోగులను కలిగి ఉంది. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 3.22 లక్షల హెచ్ఐవి పాజిటివ్ రోగులను కలిగి ఉంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక 2.74 లక్షల హెచ్ఐవి రోగులను, తమిళనాడు 1. 65 లక్షల హెచ్ఐవి రోగులను, తెలంగాణ 1 59 లక్షల హెచ్ఐవి రోగులను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా హెచ్ఐవి పాజిటివ్ కేసులను చూసుకుంటే మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా ఉంది. ఈ జిల్లాలో 19,865 హెచ్ఐవి పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కాకినాడ, తూర్పుగోదావరి పల్నాడు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం,పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం, అనకాపల్లి, కృష్ణ, శ్రీ సత్యసాయి, బాపట్ల, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ వంటి జిల్లాలు వరసగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం సగటున 3,510 మంది హెచ్ఐవి బారిన పడుతున్నారని, అలాగే 2023 సంవత్సరంలో 5310 హెచ్ఐవి రోగులు మరణించారని ఈ నివేదిక లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం 15 సంవత్సరాల నుండి 49 సంవత్సరంలోపు ఉన్న వాళ్లలోనే దాదాపు 0.62% పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)