ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలో అన్ని విమానాశ్రయాలకు, పోర్టులకు ఈ సర్క్యూలర్‌ను పోలీసులు పంపారు. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆయన ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ ద్వారా పోలీస్ అధికారులు కొడాలి నానిపై ఎల్‌వోసీ జారీ చేశారు.
కొడాలి నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ
May 23, 2025
0
Tags