ఆంధ్రప్రదేశ్ లో నారా వారి నరకాసుర పాలన నడుస్తుంది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో నారా వారి నరకాసుర పాలన నడుస్తుందని, వైసీపీ మహిళా కార్యకర్తలు నారావారి నరకాసుర వధ చేసేందుకు నడుం బిగించాలి అంటూ ఆర్కే రోజా పిలుపునిచ్చారు.  చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, అవమానాలు, అత్యాచారాలు, వేధింపులు.. ఇవే సూపర్ సిక్స్‌లు అంటూ ఎద్దేశా చేశారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏమేమి హామీలు ఇచ్చారు. ఏమేమి నెరవేర్చారో అందరికీ తెలుసన్నారు. ప్రతీ కుటుంబం గత ప్రభుత్వ హయాంలో లబ్ది పొందారు. కూటమి ప్రభుత్వం ఆ పార్టీ మహిళలను కూడా మోసం చేసిందని మండిపడ్డారు.. ఉగ్రవాదులకు మనకు మధ్య జరిగిన యుద్ధంలో ముందుంది నడిపిందే మహిళలు అని ప్రశంసించారు రోజా.. అయితే, సోషల్ మీడియాలో మహిళలను ఎలా టార్గెట్ చేయాలో టీడీపీ వాళ్లు నేర్పిస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. కానీ, అధికారంలో ఉన్నా.. లేకున్నా జగనన్న ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటారని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)