వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

Telugu Lo Computer
0


న్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. వల్లభనేని వంశీని 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి, కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే, తర్వాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీపై కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ దక్కింది. గన్నవరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరంలోని ఆత్కూర్‌ పీఎస్‌లో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గన్నవరం కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు సోమవారం విచారించింది. ఈ కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ.. వంశీకి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు అయినప్పటికీ.. వంశీ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)