హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


హైదరాబాద్ పాతబస్తీ మహారాజ్ గంజ్ లోని ఓ నివాసంలో  మంటలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. ఈ దుర్ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం జోరుగా సాగుతోంది. అయితే ప్రమాదం జరిగిన ఇంట్లో దాదాపు పది మంది వ్యక్తులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి గురైన ఇంటికి అతి సమీపంలో ప్లాస్టిక్ గోడౌన్ ఉన్న సంగతి ఆందోళనకరంగా మారింది. మంటలు అక్కడికి కూడా వ్యాపిస్తుండటంతో సహాయక చర్యలు ప్రభావితమవుతున్నాయి. ప్లాస్టిక్‌కు మంటలు అంటుకుంటే విషపూరిత గ్యాస్‌లు విడుదలయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)