ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు. అది పెద్ద ఘర్షణగా మారి చివరికి ఆ బావ, తన ఇద్దరు బావమర్దులను హత్య చేశాడు. కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ల బావ గెన్ను ఒకేసారి ఇద్దరినీ శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఒకేసారి ఇద్దరు బావమర్దులను శూలంతో పొడిచి హత్య చేసిన బావ
May 12, 2025
0
Tags