ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన విధానం మరువలేం

Telugu Lo Computer
0


అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని లోని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సులతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సమావేశమై ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కొవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన విధానం మరువలేం. ఇటీవల సింగపూర్‌లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకువచ్చింది. మిమ్మల్ని కలసి మీరు అందించే సేవలు మరచిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది. వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతో పాటు సాంత్వన కలిగిస్తుందని తెలిపారు. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)