తెలంగాణ లోని ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వీరభద్రపురం, తడపాల గుట్టలపై దట్టమైన అడవుల్లో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదరుపడగా, ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఎదరుకాల్పులు జరిగాయి. పక్కా ప్లాన్ ప్రకారం గ్రేహౌండ్స్ జవాన్లను ట్రాప్ చేసిన మావోయిస్టులు ల్యాండ్‌మైన్ ఉన్న స్పాట్‌కు రాగానే ఒక్కసారిగా పేల్చేశారు. ఈ భారీ పేలుడులో కూబింగ్‌కు వచ్చిన ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, జవాన్ల మృతిపై ఇప్పటి వరకు ములుగు ఎస్పీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ల్యాండ్‌మైన్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి
May 08, 2025
0
Tags