బాలీవుడ్ నటి నికితా దత్త తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. తన పోస్ట్ ద్వారా. “నాకు, మా అమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా ఇది ఎక్కువ కాలం మాతో ఉండకపోవచ్చు” అంటూ షేర్ చేసింది. “కొద్ది రోజులు క్వారంటైన్ తో మేము ఆరోగ్యంగా బయటకి వస్తాము” అని కూడా తెలిపింది. ఇకపోతే మహారాష్ట్రలో 2025, మే నెలలో 95 కొవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఈమె హిందీ సినిమాలు, హిందీ సీరియల్స్ లో నటించింది. ఫెమినా మిస్ ఇండియా 2012 ఫైనల్ కు చేరిన ఈమె ‘లేకర్ హమ్ దీవానా దిల్’ తో నటన రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో సహాయక పాత్ర పోషించింది .ఆ తర్వాత డ్రీమ్ గర్ల్ అనే షో తో టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఏక్ దూజే కే వాస్తే లో సుమన్ తివారీ పాత్ర పోషించి, భారీ పాపులారిటీ అందుకున్న ఈమె 2018 లో గోల్డ్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
బాలీవుడ్ నటి నికితా దత్తకి కరోనా పాజిటివ్
May 23, 2025
0
Tags