అమెరికాలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో దుండగులు అత్యంత సమీపంలోకి వచ్చి వీరిపై కాల్పులకు పాల్పడటంతో దుర్మరణం పాలైయ్యారు. ఈ విషయాన్ని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గాజాలో ఇజ్రాయెల్ మరోసారి దాడుల తీవ్రత పెంచిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ''వాషింగ్టన్ డీసీలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది అమానవీయ రీతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను చట్టం ముందు నిలబెడతాం'' అని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తన పోస్టులో పేర్కొన్నారు. మృతుల వివరాలను ప్రస్తుతం బయటకు వెల్లడించలేదు. అలాగే కాల్పుల సమయంలో ఇజ్రాయెల్ రాయబారి అక్కడ లేరని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ కార్యాలయ సిబ్బంది హత్య !
May 22, 2025
0
Tags