చర్లపల్లిలో కదులుతున్న రైలు ఎక్కబోతూ మహిళ మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో లింగంపల్లికి చెందిన మట్టల వెంకటేశ్‌, శ్వేత దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లికి వెళ్లేందుకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వారు ప్రయాణించాల్సిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో రద్దీ కారణంగా డీ-8 బోగీకి బదులు డీ-3 బోగిలోకి ఎక్కారు. ఈలోగా రైలు కదలడంతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో దిగి బోగీ మారుదామనుకున్నారు. స్టేషన్‌లో రైలు ఆగడంతో దిగిన వారిలో భర్త ఇద్దరు పిల్లలు డీ-8బోగీలోకి ఎక్కారు. కానీ శ్వేత ప్లాట్‌ ఫారంపైనే ఉండిపోయింది. ఈలోగా రైలు కదలడంతో భయపడిపోయిన శ్వేత రైలు ఎక్కబోతుండగా జారి కింద పడిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)