రాజమండ్రిలో లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. లారీని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)