కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ చేరుకొని ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ షెల్లింగ్ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను ఆయన కలిశారు. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాల్పుల వల్ల ప్రభావితమైన ఆయా వ్యక్తుల బాధలను రాహుల్ గాంధీ విని వారికి ధైర్యం చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు, రాహుల్ ఏప్రిల్ 25న శ్రీనగర్‌కు వెళ్లారు. పాకిస్థాన్ కాల్పుల కారణంగా పూంచ్ జిల్లాలో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అక్కడ 20 మందికి పైగా మరణించారు.
పాకిస్తాన్ షెల్లింగ్ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ
May 24, 2025
0
Tags