నేడు స్వతంత్ర దేశంగా అవతరించినట్లు బలూచిస్తాన్ స్వయంగా ప్రకటించుకుంది. అలాగే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ కు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అలాగే భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. పాకిస్తాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న బలూచిస్తాన్ దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ ప్రజలు తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల కొరత, పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అణచివేతలపై ఆరోపణలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది. ఇది పాకిస్తాన్ సైన్యం, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోంది.
స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్
May 14, 2025
0
Tags