మధ్యప్రదేశ్‌ లో ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ బాహాబాహీ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ ప్రభుత్వ ఏకలవ్య పాఠశాల ఆవరణలో మహిళా పాఠశాల ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ ఘర్షణకు దిగారు. ఇద్దరి మధ్య ఓ విషయంపై వాగ్వాదం మొదలైంది. సహనం కోల్పోయిన మహిళా ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ మొబైల్ ఫోన్‌ను నేలకేసి కొట్టి పగులగొట్టారు. దీంతో గొడవ మరింత పెరిగింది. ఇద్దరు టీచర్లు ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకోవడం, జుట్టు లాగడం, తీవ్ర దాడి చేసుకున్నారు. చివరికి సిబ్బంది జోక్యంతో వారిని కంట్రోల్ చేశారు. అయితే ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగినట్లు సమాచారం. వీడియో వైరల్ కావడంతో ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ భవ్య మిట్టల్ వద్దకు చేరడంతో ఆయన వెంటనే చర్యలు తీసుకుని గిరిజన సంక్షేమ శాఖ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రిన్సిపాల్ ప్రవీణ్ దహియా, లైబ్రేరియన్ మధురాణికి గత కొన్ని రోజులుగా వర్క్ విషయంలో తగాదా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇద్దరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి, తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ ఆర్య కార్యాలయానికి అటాచ్ చేశారు. ఏకలవ్య పాఠశాలలు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉండటంతో తదుపరి చర్యల కోసం ఓ నివేదికను అధికారులు ఢిల్లీకి పంపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, ఢిల్లీకి చెందిన ఉన్నతాధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)