అన్నదాతలకు ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన పథకం

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం రైతులకు తమ చివరి దశలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. నెలకు మూడు వేల రూపాయలు చెల్లిస్తుంది. వృద్ధాప్యంలో ఉండే రైతులకు ఈ పింఛను అందుతుంది. అరవై ఏళ్లు పైబడిన రైతులు మాత్రమే ఈ పింఛను పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేరుగా రైతుల ఖాతాల్లో పింఛను మొత్తం జమ అవుతుంది. వృద్ధాప్యంలో ఉన్న అన్నదాతలకు ఆసరా కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందుకోవాలంటే ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన పథకం కింద మూడు వేల రూపాయలను నెలకు చెల్లించనుంది. చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ పింఛను ను అందచేయనున్నారు. ఈ పింఛను జీవితకాలం అందనుంది. ఇందుకు ప్రధానంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు అందరూ అర్హులే. వీరికి అరవై ఏళ్ల వయసు దాటి ఉండాలి. పీఎం కిసాన్ లబ్దిదారులు కూడా ఈ పింఛను పథకం కింద నమోదు చేసుకునే అవకాశముంది. కానీ పన్ను చెల్లించే వారు, ఆర్థిక స్థితి బాగా ఉన్నవారు, ఇతర సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదు.

Post a Comment

0Comments

Post a Comment (0)