భారత దేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ దాడులు చేసింది. పాకిస్తాన్ ఉపయోగించిన వాటిలో చైనా తయారీ పీఎల్ 15 క్షిపణులు కూడా ఉన్నాయి. వాటిని వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు భారత వైమానిక దళం ఈరోజు ప్రకటించాయి. పాక్ సైన్యానికి జరిగిన నష్టానికి పాకిస్తాన్ బాధ్యత వహించాలని సాయుధ దళాలు తెలిపాయి. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ బలంగా ఉందని , పాకిస్తాన్ ఆ వ్యవస్థ జొలికి రాలేకపోయిందని స్పష్టం చేసారు. మా పోరాటం ఉగ్రవాదులు , వారి మద్దతుగా ఉన్న వ్యవస్థలపైనేనని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు. తాము పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేయలేదన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని, కానీ పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల తరపున పోరాడుతుండటం దురదృష్టకరమని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం వాటిని అడ్డుకున్నామని ఏకే భారతి తెలిపారు. ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నామని తెలిపారు. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశామని తెలిపారు. పాక్ లోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ రన్ వే కు తీవ్ర నష్టం జరిగింది. దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారని ఎయిర్ మార్షల్ సంతృప్తి వ్యక్తంచేశారు. శత్రువుల విమానాలను మన దేశం లోకి రాకుండా అడ్డుకున్నాం. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్‌కు అయినా మేం సన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పాక్‌కు జరిగిన డ్యామేజీ ఆ దేశం చెప్పుకోవడం లేదన్నారు. దాడుల్లో భారత్ పూర్తిగా సంయమనం పాటించిందని, సామాన్య ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అమాయక పౌరులను టార్గెట్ చేసుకుందని సైనికాధికారులు తెలిపారు.
పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశాము !
May 12, 2025
0
Tags