ఆంధ్రప్రదేశ్‌లో గెస్ట్‌ లెక్చరర్ల వేతనాల పెంపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల (గెస్ట్‌ లెక్చరర్లు)  వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గెస్టు లెక్చరర్లకు ప్రస్తుతం గంటకు రూ.150 పారితోషికం ఇస్తున్నారు. ఆ పారితోషికాన్ని రూ.150 నుంచి రూ.375కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు అత్యధికంగా రూ.27,000 గెస్టు లెక్చరర్లు పొందుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పెంచిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. తమ వేతనాలు పెంచాలని కొన్నేళ్లుగా టెస్టు లెక్చరర్లు పోరాటం చేస్తున్నారు. చెల్లించే వేతనాలు కూడా భారీగా బకాయి పడ్డాయి. నెలల తరబడి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాల పెంపుతో హర్షం వ్యక్తం చేస్తూనే తమ బకాయి వేతనాలు కూడా ప్రభుత్వం విడుదల చేయాలని అతిథి అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్డీయే కూటమి వెంటనే వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వీరి జీతం పెంపుతో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు కూడా పెంచాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ సంఘాలు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పడుతున్నారు. బదిలీలు, ప్రమోషన్స్‌తోపాటు పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ తదితర సమస్యలపై సోమవారం అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాల్లోని విద్యా శాఖ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)