భారత్‌తో యుద్ధం ప్రభావం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)పైనా పడింది. స్వదేశీ, విదేశీ క్రికెటర్లు పోటీపడుతున్న ఈ లీగ్‌ను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు పాక్ క్రికెట్ బోర్డు శుక్రవారం రాత్రి ప్రకటించింది. దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు పీఎస్ఎల్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని పీసీబీ తెలిపింది. అయితే, అంతకుముందు ఉదయం లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించనున్నట్టు పీసీబీ వెల్లడించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విదేశీ క్రికెటర్లు లీగ్‌లో కొనసాగేందుకు విముఖత చూపడం, స్వదేశాలకు తరలించాలని కోరడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు, పీఎ్‌సఎల్ మ్యాచ్‌ల ఆతిథ్యానికి యూఏఈ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
May 10, 2025
0
Tags