స్పెయిన్‌లో నిలిచిపోయిన అన్ని ప్రధాన మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌లు ?

Telugu Lo Computer
0


స్పానిష్‌ టెలికాం టెలిఫోనికాతో పాటు స్పెయిన్‌లోని అన్ని ప్రధాన నెట్‌వర్క్‌లు సడెన్‌గా ఆగిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్‌ కాల్స్‌, టెక్ట్స్‌ మెసేజ్ ను చేయలేకపోతున్నారు. టెలిఫోనికా నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ అంతరాయం ఏర్పడి ఉండొచ్చని స్థానిక మీడియా నివేదిస్తోంది. అయితే, మోవిస్టార్‌, ఆరెంజ్‌, వోడాఫోన్ వంటి ఇతర మొబైల్‌ నెట్‌వర్క్స్‌ కూడా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తమకు ఎదురైన సమస్యలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మొబైల్‌ నెట్‌వర్క్స్‌తోపాటు జాతీయ అత్యవసర నంబర్‌ '112' కూడా ప్రభావితమైనట్లు స్పానిష్‌ మీడియా పేర్కొంటోంది. తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు స్పెయిన్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా నాలుగువారాల క్రితం స్పెయిన్‌లో అంధకారం అలముకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మొబైల్‌ నెట్‌వర్క్స్‌ ఆగిపోవడంతో ఐరోపా దేశంలో ఏం జరుగుతోంది..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)