పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ వీర మరణం

Telugu Lo Computer
0

మ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతి చెందిన జవాన్‌ది ఆంధ్రప్రదేశ్ లోని  సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని కల్లి తండా. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయినట్లు సమాచారం. శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు తెలుస్తోంది. కాగా, వీర జవాన్ మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువుతండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో చదివాడు. జవాన్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్వగ్రామం కల్లితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో మరణించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడికి నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)