ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళా ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెడతామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇవాళ మహిళా ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ ఒక దానిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 120 రోజులు ఇస్తున్నారు. వీటిని ఇప్పుడు 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న తరహాలోనే వీటిని 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మహిళా ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రసూతి సెలవు ప్రస్తుతం ఇద్దరు పిల్లల వరకూ మాత్రమే ఉండగా, ఈ లిమిట్ ను కూడా ఎత్తేస్తూ ప్రభుత్వం మరో నిర్యం తీసుకుంది. దీన్ని కూడా ఇదే జీవోలో వెల్లడించారు. తద్వారా ఎంతమంది పిల్లల్ని కన్నా ప్రసూతి సెలవులు మాత్రం యథావిథిగా వర్తించబోతున్నాయి.
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఆరు నెలలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ !
May 05, 2025
0
Tags