డ్రీమ్ 11 లో గేమ్ లో రూ.4 కోట్లు గెలుచుకున్న ఉత్తరప్రదేశ్ వాసి మంగల్ సరోజ్

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలోని ఘసి రామ్ కా పూర్వ గ్రామంలో నివసించే మంగల్ సరోజ్ ఈ ఏడాది మార్చి నెల నుంచి డ్రీమ్ 11 లో గేమ్ ఆడటం ప్రారంభించాడు. ఏదో ఒక రోజు డ్రీమ్ 11లో కోట్లు గెలవాలని అనుకునేవాడు. ఈ క్రమంలో డబ్బులు పోతున్నా సరే డ్రీమ్ 11 గేమ్ ఆడుతూనే ఉన్నాడు. 77సార్లు డ్రీమ్ 11లో డబ్బులు పెట్టినా రాలేదు. అయితే 78వ సారి సరోజ్ ని అదృష్టం వరించింది. డ్రీమ్ 11లో 78వ సారి కేవలం రూ.39 పెట్టి గేమ్ ఆడి రూ.4 కోట్లు గెల్చుకున్నాడు. దీంతో డ్రీమ్ 11 లో కోట్లు సంపాదించాలనే సరోజ్ కల నెరవేరింది. రెండు నెలల నుంచి రోజూ రూ. 49 పెట్టుబడి పెట్టి డ్రీమ్ 11లో గేమ్ ఆడేవాడినని, ప్రతి గేమ్ లో తాను ఓడిపోయానని, అయినా నిరుత్సాహపడకుంటా ప్రయత్నిస్తూనే ఉండేవాడినని మంగల్ సరోజ్ చెప్పాడు. ఏప్రిల్ 30న పంజాబ్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తన అకౌంట్ లో చూసుకుంటే కేవలం రూ.39 రూపాయలు ఉన్నాయని, ఈ సారి కూడా ట్రై చేద్దామని ఆ రూ.39ని పంజాబ్, చెన్నై మ్యాచ్ లో పెట్టుబడిగా పెట్టానని, దీంతో తాను కలలో కూడా ఊహించని విధంగా రూ.4 కోట్లు తాను గెల్చుకున్నట్లు సరోజ్ చెప్పాడు. సంతోషంలో తనకు మాటలు రావడం లేదని, అందరూ తనను అభినందిస్తున్నారని..ఇదంతా నిజంగా తన లక్ అని తెలిపారు. ట్యాక్సులు పోగా వచ్చే డబ్బుతో ఏ వ్యాపారం పెట్టుకొని బతుకుతానని చెప్పాడు. తన కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటానని చెప్పాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)