యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద మృతి ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ఏ కొండూరు గ్రామానికి చెందిన యూట్యూబర్ మధుమతి (22)తో తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని మధుమతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతాప్‌ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మధుమతి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని లక్షల్లో సబ్‌స్కైబర్లను పొందింది. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది. అయితే ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో తమ కుమార్తెను ప్రతాపే వెంట తీసుకెళ్లి ఎవరికి అనుమానం రాకుండా ఉరేసి చంపేశాడని ఆరోపణలు వున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)