న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కొత్త మల్టీ-ఏజెన్సీ సెంటర్ ను శుక్రవారంనాడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యూహాత్మక్మ వృద్ధి, నిర్వహణా సామర్థ్యాలకు 'ఆపరేషన్ సిందూర్' ఒక ఉదాహరణ అని చెప్పారు. ఆపరేషన్ విజయవంతానికి ప్రధానమంత్రి మోడీ దృఢమైన రాజకీయ సంకల్పం, కచ్చితమైన, సకాలంలో అందిన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల సత్తా కారణాలని ప్రశంసించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఆధ్యర్యంలో కొత్తగా ప్రారంభించిన మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఏసీ) పనిచేస్తుంది. దేశవ్యాపంగా ఉన్న వివిధ భద్రతా సంస్థలు, నిఘా ఏజెన్సీల మధ్య సమచార మార్పిడి, సమన్వయానికి ఎంఏసీ కృషి చేస్తుంది. అంతర్గత, బహిర్గత ముప్పును అంచనా వేసి, ఆ ముప్పను నివారించేందుకు అవసరమైన రియల్ టైమ్ ఇంజెలిజెన్స్ షేరింగ్, సత్వర స్పందన మెకానిజం, ఇంటర్-ఏజెన్సీ సినర్జీ మెరుగుపరచేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి ముందు, ఇటీవల ముగిసిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'లో గాయపడిన ఐదుగురు భద్రతా సిబ్బందిని అమిత్‌షా పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స, క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ట్రౌమా సెంటర్‌లో వీరు చికిత్స పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కరెగుట్ట హిల్స్‌లో బలగాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మావోయిస్టులపై జరిగిన ఈ అతిపెద్ద ఆపరేషన్ 21 రోజుల పాటు సాగింది. పలువురు వాంటెడ్ కమాండర్స్‌తో సహా 31 మంది టాప్ నక్సలైట్లను ఈ ఆపరేషన్‌లో బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో అసిస్టెంట్ కమాండంట్ సాగర్ బొరాడే (204 కోబ్లా బెటాలియన్), హెడ్ కానిస్టేబుల్ మునీష్ చంద్ శర్మ (203 కోబ్రా), కానిస్టేబుల్ ధను రామ్ (204 కోబ్రా), కానిస్టేబుల్ కృష్ణ కుమార్ గుర్జర్ (196 సీఆర్‌పీఎఫ్), కానిస్టేబుల్ సంతోష్ మురమి (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఛత్తీస్‌గఢ్ పోలీస్) ఉన్నారు. దేశంలో నక్సల్స్ నిర్మూలకు చేపట్టిన మిషన్‌లో 'ఆపరేషన్ బ్లాక్‌ఫారెస్ట్' సాధించిన విజయం చారిత్రకమని, ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో 2026 మార్చికల్లా దేశంలో నక్సల్స్ నిర్మూలను కేంద్ర కృతనిశ్చయంతో ఉందని అమిత్‌షా పునరుద్ఘాటించారు.
దేశ వ్యూహాత్మక వృద్ధి, నిర్వహణ సామర్థ్యానికి 'ఆపరేషన్ సిందూర్' ఒక ఉదాహరణ !
May 16, 2025
0
Tags