చైనాలో బయటపడ్డ భారీ బంగారు గని

Telugu Lo Computer
0


చైనా హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్‌ కౌంటీలో భారీ బంగారు గని ఉన్నట్టు హునాన్‌ ప్రావిన్స్‌ జియోలాజికల్‌ బ్యూరో ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్​సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్​పాట్ తగిలినట్లైంది. భూమి లోపల రెండు కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు. డ్రిల్​చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఒకే చోట వెయ్యి టన్నులు ఉందని చెబుతున్నారు. పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది అంటున్నారు. ఇందులో నిజం ఉండోచ్చు. ఎందుకంటే.. బంగారం మిగతా లోహాలతో కలవదు. విడిగానే ఉంటుంది. అది దాని ప్రత్యేక లక్షణం. అందువల్ల భూమిలో బంగారం దొరికితే, అది ప్యూర్ గానే ఉంటుంది. ఈ బంగారం విలువ రూ.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటివరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్​ఆఫ్రికాలోని ‘సౌత్​ డీప్​ మైన్’​ పేరు మీద ఉంది. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. చైనాలో గుర్తించిన మైన్​ఈ రికార్డును బద్దలుగొట్టింది. ఓ అంచనా ప్రకారం.. 3 కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉందట. ఏ దేశానికైనా బంగారం అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు. ఒక దేశం ఎంత బంగారం కలిగి ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది. ఇప్పటికే చైనా- ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారు. నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే.. ప్రపంచం గోల్డ్ మార్కెట్ డ్రాగన్ కంట్రీ శాసించడం ఖాయమని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)