భారత్‌లో ఇండియా యమహా ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. కస్టమర్ సర్వీస్ విస్తరణలో మరో అడుగు ముందుకేస్తూ రూ.975తో ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. వాహనాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినా, ప్రమాదాలు, బ్యాటరీ వైఫల్యాలు, టైర్లు పగిలిపోవడం, చిన్న మరమ్మతులు వంటి అనేక అత్యవసర పరిస్థితులను ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు టోయింగ్ సర్వీస్, ఆన్- సైట్ రిపేర్ సపోర్ట్ సహాయాన్ని పొందొచ్చు. దేశవ్యాప్తంగా 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఈ రోడ్‌సైడ్ అసిస్టెన్స్.. యమహా ఇటీవల 10 సంవత్సరాల వారంటీ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 2 ఏళ్ల సాధారణ వారెంటీ, 8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారెంటీ ఇమిడి ఉంటాయి.
యమహా కస్టమర్లకు ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ !
May 30, 2025
0
Tags