ఢిల్లీ ఉద్యోగ్ భవన్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ కు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. శక్తివంతమైన పేలుడు పదార్ధాలతో దాడి జరగనుందంటూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి అడ్రెస్ చేస్తూ ఈ-మెయిల్ బెదిరింపు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సీఐఎస్ఎస్ బలాగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఆయా కార్యలాయాల్లోని సిబ్బందిని బయటకు పంపించి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. పార్లమెంటుకు సమీపంలోని హై-సెక్యూరీటీ ప్రాంతంలో ఉద్యోగ్ భవన్ ఉంది. ఇందులో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. భారీ పరిశ్రమల శాఖకు సంబంధించిన నివాసాలు ఉన్నాయి. తాజాగా ఉద్యోగ్ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)