గుంటూరు జీజీహెచ్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరలింపు

Telugu Lo Computer
0


శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న  మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీ సమయంలో వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కంపిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మాజీ ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. కానీ మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. జీజీహెచ్‌లో వంశీకి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. కాగా.. జైలులో శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. దీంతో వైద్యం అందించాల్సిందిగా న్యాయధాకారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి వంశీని అనారోగ్యం కారణంగా జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)