సుప్రీంకోర్టులో బెట్టింగ్‌ యాప్‌లపై కేఏ పాల్ పిటిషన్ దాఖలు

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టులో బెట్టింగ్ యాప్ లపై నిషేధం విధించాలన్న పిటిషన్ పై విచారణ జరిగింది. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ లపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు దేశంలోని యువత ప్రమాదంలో ఉందని పేర్కొంది. కాగా ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు సుప్రీంక్టు నోటీసులు జారీ చేసింది. కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది కాగా ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము ఇంటర్నెట్ ఇచ్చాము. తల్లిదండ్రులు ఒక టీవీని, పిల్లలు మరొక టీవీని చూస్తారు. ఇది పూర్తి సామాజిక ఉల్లంఘన. సమస్య తీవ్రతను ఆయన అంగీకరించారు. కానీ, ప్రజలు స్వచ్ఛందంగా ఈ పనులను చేస్తున్నారు. ఇలా జరగకుండా ఏమి చేయవచ్చు? ప్రధానంగా మేం మీతో ఉన్నాం. దీన్ని ఆపాలి. కానీ చట్టం ద్వారా దీన్ని ఆపవచ్చనే అపోహలో మీరు ఉండవచ్చు. చట్టం ఉన్నప్పటికీ ప్రజలను హత్య చేయకుండా మనం ఆపట్లేదు కదా ఇది కూడా అలాంటి కేసే" అని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా కోర్టు ఎదుట హాజరైన కేఏ పాల్, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం వల్ల పిల్లలను కోల్పోయిన లక్షలాది మంది తల్లిదండ్రులకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణలోనే 1,023 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, 25 మందికి పైగా బాలీవుడ్, టాలీవుడ్ నటులు, ఇన్ఫ్ ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లు చేపట్టారని.. వారిపై ఎఫ్‌ఐఆర్‌లు కూడా దాఖలైనట్లు పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా 30 కోట్ల మంది భారతీయులు "చట్టవిరుద్ధంగా చిక్కుకుపోతున్నారు" అని కేఏ పాల్ ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వారి జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బెట్టింగ్ గురించి ఎటువంటి హెచ్చరిక లేదా అవగాహన లేదని అన్నారు. అంతేకాకుండా పిటిషన్ విచారణ సందర్భంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరుని కేఏపాల్ ప్రస్తావించారు. "క్రికెట్ గాడ్ ఆమోదిస్తున్నాడు. అప్పుడు ప్రజలు అది సరేనని అనుకుంటారు" అని అన్నారు. అయితే, దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ "ఐపీఎల్ చూడటం పేరుతో బెట్టింగ్ జరుగుతుందని ఆయనకు తెలుసు కాబట్టి. అది ఏమి చేస్తుందో మేం యూనియన్‌ను అడుగుతాము." అని పేర్కొన్నారు. కాగా.. ఈ కేసులో కేంద్రప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు.. పిటిషన్ సాఫ్ట్ కాపీని భారత అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కు అందించాలని ఆదేశించింది. అవసరమైతే, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)