భారత ఉక్కుపై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో, భారత్ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. అమెరికా తీసుకున్న నిర్ణయానికి నిరసనగా, భారత్ ప్రస్తుతం అమెరికా నుండి దిగుమతి అయ్యే పలు వస్తువులపై అదనపు సుంకాలు విధించేందుకు ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. ఈ చర్యల విషయమై భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థకి అధికారిక సమాచారం ఇచ్చినట్టు సమాచారం. అమెరికా తీసుకున్న చర్యల వల్ల భారత్ ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి ప్రతీకార చర్యల ప్రణాళిక సిద్ధంగా ఉంచినప్పటికీ, వాటిని ఎప్పుడు అమలు చేయాలనే విషయంలో భారత్ చర్చలు కొనసాగిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అమెరికా వాణిజ్య విధానంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలకు సిద్ధమైన భారత్
May 13, 2025
0
Tags