టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రాజకీయ కక్ష్యతోనే నన్ను ఇరికించే ప్రయత్నం

Telugu Lo Computer
0


గుంటూరు సీఐడీ కార్యాలయానికి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. రెండు గంటలపాటు సీఐడీ అధికారులు ఆర్కేను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. నోటీసు ఇవ్వడంతో తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. తాను ఆ రోజు లేనని, దాడి జరిగిన అంశం నాకు తెలియదని అని విచారణలో చెప్పానన్నారు. “నాకు నోటీస్ ఇవ్వడమే దారుణం. 2021లో జరిగిన అంశంపై పోలీసులు విచారణ చేశారు. అదే దర్యాప్తులో కొత్తగా నోటీసులు ఇవ్వడం దారుణం. నారా లోకేష్ పై నేను గెలిచాను కాబట్టే తప్పుడు కేసులు పెడుతున్నట్లు అనిపిస్తుంది. రాజకీయ కక్ష్యతోనే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కేసుల్లో నన్ను ఇరికించాలని చూశారు ఎక్కడ ఏది కనిపించలేదు. నేను కేసులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరు నా పేరుని చెప్పి కూడా ఉండరు. సీసీటీవీ ఫుటేజ్ లో ఎక్కడ నేను లేను. ఛార్జ్ షీట్ వేసే ముందు కావాలని నా పేరుని ఈ కేసులో చేర్చారు.” అని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)