ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని నలుగురు ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తొలుత ఒక ఉద్యోగికి పాజిటివ్ రాగా కలెక్టరేట్‌లోని అన్ని శాఖల అధికారులకు, ఉద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ పరీక్షలు చేసింది. మొత్తం నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో కలెక్టరేట్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మొత్తంగా ఏలూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. కరోనా కేసుల తీవ్రత పెరగడంతో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ అయి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్
May 31, 2025
0
Tags