అక్రమ సంబంధానికి దారితీసిన ఫేస్‌బుక్ పరిచయం : బోరింగ్‌కి కట్టేసి దేహశుద్ధి చేసిన కాలనీవాసులు

Telugu Lo Computer
0


తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఫేస్‌బుక్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరూ వివాహితులే. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడిది భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేట గ్రామం. పెళ్లయిన కొద్దిరోజులకే విడాకులు తీసుకున్నాడు. ఆమె ఫేస్‌బుక్‌ ప్రియుడ్ని ఏకంగా ఇంటికే పిలిపించుకుంటూ వచ్చింది. ఆ వీధిలోని వాళ్లు ఇది తప్పు, అలా చెయ్యొద్దని ఎన్నోసార్లు నచ్చజెప్పారు. భర్త  చెప్పీచెప్పీ విసిగిపోయి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. ఇక అడ్డుచెప్పేవాళ్లెవరూ లేకపోవడంతో ఫేస్‌బుక్‌ ప్రియుడ్ని పర్మినెంట్‌గా ఇంటికి రప్పించుకుంది. ఎన్నో రోజులుగా ఈ బాగోతాన్ని గమనిస్తూ వస్తోన్న కాలనీవాసులు ఇద్దర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. బోరింగ్‌కి కట్టేసి దేహశుద్ధిచేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించడంతో కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)