సౌందర్య మరణం నాన్నను మనోవేదనకి గురి చేసింది : మంచు విష్ణు

Telugu Lo Computer
0


అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న "కన్నప్ప" చిత్రం జూన్ 27వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మంచు విష్ణు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె మరణం తర్వాత నాన్న అలా చేస్తారని అనుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సౌందర్య మరణం గురించి మా నాన్నపై ఎన్నో ఆరోపణలు వినిపించాయని చెప్పుకొచ్చారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. సౌందర్య మరణ వార్త విన్నప్పుడు తాము షూటింగ్ సెట్లోని ఎడిటింగ్ రూమ్ లో ఉన్నామని, నాన్నకి ఈ విషయం చెబుతామని నేను ఆయన రూమ్ కి వెళ్లామన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ తనకు సైగలు చేసి సౌందర్య మరణించిన విషయాన్ని చెప్పమన్నారని, ఆ విషయాన్ని నాన్నకి చెప్పిన వెంటనే బాధతో కేకలు వేశారని వాపోయారు. ఆ తర్వాత చాలా బిగ్గరగా అరిచారని, ఇది నిజం కాదు అనేలా మాట్లాడారని వివరించారు. ఆరోజు నాన్న ప్రవర్తించిన తీరు ఇప్పటికీ గుర్తుందని ఆమె మరణం నాన్నను మనోవేదనకి గురి చేసిందని వాపోయారు. ఇక రీసెంట్ గానే సౌందర్య మరణం గురించి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. సౌందర్యని చంపింది మోహన్ బాబేనని.. సౌందర్య జల్ పల్లి లోని తన 6 ఎకరాల భూమి అమ్మమంటే.. అమ్మక పోవడంతో కక్ష్య పెంచుకొని.. సౌందర్యని ఆమె సోదరుడిని ఒక పథకం ప్రకారం చంపించాడని ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలు కూడా దొరకకుండా చేశారంటూ సంచలన ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసు వ్యవహారం మీడియాలో సైతం హాట్ టాపిక్ అయ్యింది. అయితే సౌందర్య భర్త రఘు మాత్రం ఆ కేసు విషయాన్ని కొట్టిపారేశారు. మోహన్ బాబుకు, తమకు మంచి అనుబంధం ఉందని అన్నారు. సౌందర్యది విమాన ప్రమాదమని, అందులో మోహన్ బాబు ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)