చిట్‌చాట్‌ల పేరుతో మా పార్టీని వివాదంలోకి లాగవద్దు : కవిత వ్యాఖ్యలపై రఘునందన్‌రావు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాజపా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్‌తో తెరాస పొత్తు పెట్టుకుందన్నారు. 2009లో మహా కూటమి పేరుతో పలు పార్టీలతో పొత్తు పెట్టుకుందని చెప్పారు.  భారాస ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ''2014లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది ఎవరు? భారాసతో భాజపా ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? మా పార్టీ ఎదుగుదలను ఆపాలని కుట్రలు పన్నుతున్నారు. చిట్‌చాట్‌లు ఎందుకు? ధైర్యముంటే ప్రెస్‌మీట్‌లు పెట్టండి. తప్పుడు వార్తలు రాయిస్తున్నారని చెప్పడం ఎందుకు? భారాసతో మా పార్టీ అధిష్ఠానం ఎప్పుడూ మాట్లాడలేదు. లేనిపోని పంచాయితీలు ఎందుకు? కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పండి. చిట్‌చాట్‌ల పేరుతో మా పార్టీని వివాదంలోకి లాగవద్దని కవితకు  విజ్ఞప్తి చేస్తున్నా. మీ సొంత పంచాయతీలు మీరే తేల్చుకోండి. మమ్మల్ని లాగవద్దు.  రాష్ట్రంలో భాజపా బలం పుంజుకుంటోంది.. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఒక్క సీటూ గెలవలేదు. ఆ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని ప్రజలు భావిస్తున్నారు. భాజపా, భారాస ఒక్కటనే తప్పడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత చెల్లని రూపాయి అయ్యారు. పదేళ్ల పాలనలో అమరుడు శ్రీకాంత్‌చారి కుటుంబానికి ఏమీ దక్కలేదు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన 1200 మంది అమరులను పట్టించుకోలేదు. కేసీఆర్ కుటుంబం పదేళ్లు దోచుకుంది. హరీశ్‌రావు భాజపా కోవర్టు అయితే మంత్రివర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? భారాస బలహీనపడాలి అనుకునేవాళ్లే కవిత వెనక ఉన్నారు. ఆమె కొత్త పార్టీ పెడుతోందని నాకు సమాచారముంది. భారాసకు అభ్యర్థులు లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కోవర్టు పని చేసే వాళ్లు భాజపాలో ఉండరు'' రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)