ఉచితంగా ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఎయిర్‌టెల్‌

Telugu Lo Computer
0


స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు ఇప్పటికే తగిన చర్యలు చేపట్టిన ఎయిర్‌టెల్‌ కంపెనీ సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టడానికి ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాట్సాప్, ఈ-మెయిల్స్‌ ద్వారా జరిగే సైబర్‌ మోసాలను ఈ సెక్యూరిటీ సిస్టమ్‌ అడ్డుకోనుంది. దాంతో ఎయిర్‌టెల్ వినియోగదారులను సైబర్‌ క్రైమ్ బారిన పడకుండా ఈ ఫీచర్‌ కాపాడనుంది. కాగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో ఇది పని చేయనుంది. మనకొచ్చే లింక్స్‌ను క్లిక్‌ చేసినప్పుడు ఈ సిస్టమ్‌ దాన్ని పూర్తిగా చెక్‌ చేస్తుంది. ఒకవేళ సైబర్‌ మోసాలకు అవకాశం ఉన్న మోసపూరిత లింక్‌ అయితే.. దాన్ని ఓపెన్‌ కాకుండా ఈ ఫీచర్‌ వెంటనే బ్లాక్‌ చేస్తుంది. ఒకవేళ ఆ లింక్‌ సురక్షితమని భావిస్తే తక్షణమే ఆ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అయితే, సైబర్‌ నేరాలు పెరుగుతుండటంతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. కాగా, మొబైల్‌ బ్రౌజర్‌, ఈ-మెయిల్‌, ఎస్ఎంఎస్, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా తదితర యాప్స్‌ వేదికగా ఈ ఫ్రాడ్ డిటెక్షన్ పని చేయనుంది. ఎయిర్‌టెల్‌ మొబైల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఆటోమేటిక్‌గా ఈ సదుపాయం ఎనేబుల్‌ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయం హర్యానా సర్కిల్‌లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ వాడుతున్న వారికి ఇప్పటికే ఆటోమేటిక్‌గా స్పామ్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు గుర్తించే సదుపాయం వర్క్ అవుతుంది. పది భాషల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రాగా, ఇదే తరహాలో ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయం కూడా పని చేస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)