తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపాన బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసుల వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా రోడ్డుపై నిలిపిన లారీని వీరి బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
లారీని ఢీకొన్న టూరిస్టు బస్సు : నలుగురి దుర్మరణం
May 20, 2025
0
Tags