తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో పోకో C71 విడుదల !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్‌లో పోకో C71 ను తక్కువ ధరకే లాంచ్ చేసింది. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ, 4G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లతో ఈ ఫోన్ ని లాంఛ్ చేయడం కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. 6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్‌ ప్లేతో వస్తుంది. TUV Rheinland సర్టిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు, లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కేడియన్ సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వెట్ టచ్ డిస్‌ప్లే సదుపాయం కూడా ఇందులో ఉండడం మరింత ప్లస్ అని చెప్పాలి. దీంతో తడిగా ఉన్న చేతులతో కూడా ఫోన్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. 6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్‌ ప్లేతో ఈ ఫోన్ వస్తుంది. 32MP బ్యాక్ కెమెరా , సెకండరీ కెమెరా, LED ఫ్లాష్, అలాగే 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. 4GB ర్యామ్ + 64GB రోమ్, 6GB ర్యామ్ + 128GB రోమ్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా 6GB వరకు ర్యామ్‌తో పాటు 6GB వరకు వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Android 15 తో విడుదల అవుతోంది. Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 1.8 GHz Octa-Core Unisoc T7250 12nm ప్రాసెసర్, Mali-G57 MP1 GPUను కలిగి ఉంది. POCO కంపెనీ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇచ్చింది. 5200mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 6,499 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499గా కంపెనీ నిర్ణయించింది కంపెనీ. ఈ ఫోన్ ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అందుబాటులో ఉంటుంది. ఇకపోతే, ఎయిర్టెల్ వినియోగదారుల కోసం POCO C71 కేవలం రూ. 5,999కి ప్రత్యేక ఆఫర్ కింద పొందవచ్చు. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ లో USB Type-C పోర్ట్, IP52 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, 3.5mm ఆడియో జాక్ కలిగి ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)