గేదె, ఆవు పాల సేకరణ ధరలను సవరించిన విజయ డెయిరీ !

Telugu Lo Computer
0


గేదె, ఆవు పాల సేకరణ ధరలను తెలంగాణ పాడి పరిశ్రామాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) సవరించినట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ వేల మంది పాడి రైతుల నుంచి లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ సేకరిస్తోంది. ఈ మేరకు గేదె పాల ధర పెంచగా, ఆవు పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వెన్న శాతం 7 ఉన్న గేదె పాలు లీటరుకు రూ.56 చెల్లించగా, తాజాగా దాన్ని రూ.59.50కి పెంచింది. అలాగే 10 శాతం వెన్న ఉన్న గేదె పాల ధర లీటర్‌కు రూ.80 నుంచి రూ.84.60కి పెంచింది. 3 శాతం వెన్న ఉన్న ఆవు పాల ధర ఇప్పటివరకూ రూ.40 ఉండగా.. తాజాగా రూ.36.50కు తగ్గించింది. ధరల సవరణ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు విజయ డెయిరీ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)