రక్సౌల్ - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లో మైనర్ బాలికపై అఘాయిత్యం !

Telugu Lo Computer
0


రిస్సాకు చెందిన ఒక కుటుంబం రక్సౌల్ - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్  లో ప్రయాణిస్తున్నారు. రాత్రి 2గంటల ప్రాంతంలో మైనర్ బాలిక వాష్ రూమ్ కు వెళ్లింది. అక్కడున్న ఒక కామాంధుడు బాలికను అటకాయించి వాష్ రూమ్ లో బాలికను బంధించి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా తన ఫోన్ లో రికార్డు చేసుకున్నాడు. వెంటనే బాలిక తన వాళ్లకుచెప్పడంతో దుర్మార్గుడ్ని బాలిక కుటుంబ సభ్యులు, అక్కడున్న వారి సాయంతో పట్టుకుని ట్రైన్ సికింద్రాబాద్ కు చేరుకొగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత తండ్రి పలు వీడియోలను జీఆర్పీ పోలీసులకు చూపించాడు. ఈక్రమంలో పోలీసుల కామాంధుడి మీద పోక్సో ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)